close

తాజావార్తలు

‘శ్రీదేవి’ నాకెంతో సంతృప్తినిచ్చింది: పూజా

హైదరాబాద్‌: వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా హరీశ్‌శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గద్దలకొండ గణేష్‌’. ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్‌ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా కథానాయిక పూజా హెగ్డే సోషల్‌మీడియా వేదికగా ఓ అపురూప చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక నటిగా ఎన్నో విభిన్న ప్రాతల్లో నచించాలని ఉంటుంది. ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంలో ఓ అమాయకురాలైన గ్రామీణ అమ్మాయి పాత్రలో నటించడం నాకెంతో సంతృప్తినిచ్చింది. ఈ సినిమాలో ‘శ్రీదేవి’ పాత్ర ఉండేది కొంతసమయమే అయినా మనందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమైనది. ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రం విడుదల ఈరోజే. మిమ్మల్ని థియేటర్‌లో కలుస్తాను.’ అని పూజా పేర్కొన్నారు.

‘గద్దలకొండ గణేష్‌’ చిత్రాన్ని 14 రీల్స్‌ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమిళ నటుడు అధర్వ ఈ చిత్రంలో కీలక పాత్రలో పోషిస్తున్నారు. ముకుంద తర్వాత పూజా, వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.