close

తాజావార్తలు

రజనీకి అభినందనలు

రజనీకాంత్‌ను శాలువాతో సత్కరిస్తున్న పొన్‌.రాధాకృష్ణన్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ‘ఐకాన్‌ ఆఫ్‌ ది గోల్డెన్‌ జూబ్లీ’ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరగనున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా రజనీకాంత్‌కు ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ సందర్భంగా పోయెస్‌గార్డెన్‌లోని స్వగృహంలో రజనీకాంత్‌ను కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత పొన్‌ రాధాకృష్ణన్‌ కలిశారు. సూపర్‌స్టార్‌కు అభినందనలు తెలపడంతోపాటు శాలువా కప్పి సన్మానించారు. రజనీకాంత్‌ను నేరుగా కలిసి మనసారా అభినందనలు తెలియజేశానని అనంతరం ఆయన తెలిపారు. ఈ భేటీ రాజకీయపరమైనదని కూడా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితిపైనా చర్చించుకున్నారని సమాచారం. అధికారికంగా మాత్రం రజనీని అభినందించడానికే పొన్‌ రాధాకృష్ణన్‌ వెళ్లి కలిశారని సంబంధిత వర్గాలు అంటున్నాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.