
తాజావార్తలు
చెన్నై: ‘నిజజీవితంలో సోదరిని ఉండడం నా అదృష్టం’ అని శ్రుతిహాసన్ అన్నారు. ప్రస్తుతం శ్రుతి తమిళంలో రాబోతున్న హలీవుడ్ చిత్రం ‘ఫ్రోజన్ 2’లో రాకుమార్తె ఎల్సా పాత్రకు గాత్రం ఇచ్చారు. ఈనెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రుతి ఓ స్పెషల్ వీడియోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘ఫ్రోజన్ 2’ చిత్రం ప్రతి ఒక్కరికీ బాగా నచ్చుతుందని ఆమె పేర్కొన్నారు.
‘‘ఫ్రోజన్ 2’ కుటుంబమంతా కలిసి చూసే చిత్రం. నిజజీవితంలో సోదరి(అక్షర) ఉండడం నా అదృష్టం. అక్కాచెల్లెళ్ల ప్రేమ చాలా ప్రత్యేకం. నా జీవితంలో అలాంటి ప్రేమాభిమానాలును పొందుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం నా జీవితంలో సోదరి ప్రేమ కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఫ్రోజన్ 2’ చిత్రంలో ఎల్సా కీలకమైన అమ్మాయి మాత్రమే కాదు.. ఎంతో ధైర్యవంతురాలు, స్వేచ్ఛా భావాలు ఉన్న యువతి. నిజజీవితంలో ఎల్సావంటి ధైర్యవంతులు చాలామంది ఉన్నారు. ఎల్సా-అన్నా మధ్య ఉన్న సోదరి ప్రేమ ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుంది. ఓ అక్కగా ఎల్సా తన చెల్లి ‘అన్నా’ మీద చూపించిన భావాలను బాగా అర్థం చేసుకుని నా గాత్రాన్ని ఇచ్చాను’ అని శ్రుతి అన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ