మంచం కింద దాగి.. భార్య ప్రియుడ్ని అంతం చేసి..
close

తాజా వార్తలు

Published : 27/03/2021 01:26 IST

మంచం కింద దాగి.. భార్య ప్రియుడ్ని అంతం చేసి..

బెంగళూరు: తనకు దూరమైన భార్యతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తిని హత్య చేశాడో భర్త. ఇందుకోసం 6గంటల పాటు మంచం కింద దాక్కొన్నాడు. ఈ ఉదంతం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా బైడరహల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌ కుమార్‌ (31)కు వినుత అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. అయితే, మూడేళ్ల క్రితం ఉద్యోగాన్వేషణలో భాగంగా వినుత స్నేహితుడు శివరాజ్‌ బెంగళూరు నగరానికి వచ్చాడు. ఇటీవలి శివరాజ్‌ వినుత ముందు తన ప్రేమ ప్రతిపాదన ఉంచాడు. తొలుత ఆమె నిరాకరించినప్పటికీ.. ఆత్మహత్య చేసుకుంటానని అతడు బెదిరించడంతో చివరకు అంగీకరించింది. ఇంతలోనే వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించిన భరత్‌ ఆగ్రహంతో రగిలిపోయాడు. తమ సంసారంలో చిచ్చుపెట్టిన శివరాజ్‌ను అంతమొందించాలని భావించాడు. భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో వినుత బైడరహల్లిలోనే మరో ఇంట్లో వేరుగా ఉంటోంది. వారంలో రెండు సార్లు శివరాజ్‌ ఆమె నివాసానికి వస్తుంటాడు.

ఈ క్రమంలోనే, బుధవారం రాత్రి 9గంటల సమయంలో వినుత చికెన్‌ కొనేందుకు బయటకు వెళ్లిన సమయంలో భరత్‌ ఆమె ఇంట్లోకి చొరబడి మంచం కింద దాక్కున్నాడు. ఆ తర్వాత 10.30గంటల సమయంలో అక్కడికి శివరాజ్‌ వచ్చాడు. వినుత, శివరాజ్‌ భోజనం చేసి నిద్రపోయారు. తెల్లవారు జామున 3గంటల సమయంలో వినుత వాష్‌రూమ్‌కి వెళ్లగా.. భరత్‌ ఆ గదికి తాళం వేశాడు. అనంతరం తాను తీసుకొచ్చిన కత్తితో శివరాజ్‌ను హత్య చేశాడు.  నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అతడిని కోర్టులో హాజరు పరిచి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలిస్తామన్నారు. భరత్‌ తన నేరాన్ని అంగీకరించాడని, వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసినట్టు పోలీసులు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని