
తాజా వార్తలు
యూట్యూబ్‌లో చూసి చోరీలు
ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు

సొత్తు పరిశీలిస్తున్న సీపీ అంజనీకుమార్
ఈనాడు, హైదరాబాద్: యూట్యూబ్‌లో దొంగతనాల వీడియోలు చూసి ఇళ్లలో చోరీలు చేస్తున్న ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఆబిడ్స్ పోలీసులు, దక్షిణమండలం టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచి 23 బైకులు, కిలో వెండి, రూ.35లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నామని కొత్వాల్ అంజనీ కుమార్ శనివారం తెలిపారు. బీదర్‌కు వాజిద్(19) ఉపాధి కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి పాతనేరస్థుడైన అబ్దుల్సమీర్తో ముఠా ఏర్పాటు చేశాడు. ముఠాతో 26 నేరాలు చేశాడు. ఇందులోని మరోముగ్గురు పరారయ్యారు. తీవ్రనేరాలకు పాల్పడ్డంతో వీరిపై పీడీచట్టం ప్రయోగించనున్నట్లు సీపీ తెలిపారు.
మహాలక్ష్మి ఆలయం.. పోలీసు పరిశోధన
జనవరి 3న జగదీష్‌మార్కెట్‌లోని మహాలక్ష్మి ఆలయంలో చోరీపై ఆబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. మధ్యమండలం సంయుక్త కమిషనర్ పి.విశ్వప్రసాద్ స్వయంగా రంగంలోకి దిగారు. నాంపల్లిలోని ఓ లాడ్జిలో వాజిద్ వివరాలు లభించాయి. వీటి ఆధారంగా షేక్సోను, అబ్దుల్ సమీర్ల వివరాలు లభించాయి. దక్షిణమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసుల సాయంతో వాజిద్, సోను, అబ్దుల్ సమీర్, మహ్మద్ సమీర్‌లను శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తును తీసుకున్న బాబూరావ్, ఇస్మాయిల్నూ పట్టుకున్నారు. వాజిద్ ముఠా.. పగలంతా లాడ్జిల్లో నిద్రపోయి.. రాత్రివేళల్లో శివారు ప్రాంతాలకు వెళ్లి అక్కడ దొంగతనాలు చేస్తున్నారు. తాళం పగులగొట్టేందుకు ఓ ప్రత్యేకమైన రాడ్‌ను, వేలిముద్రలు పడకుండా తొడుగులను వాటినట్లు టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు.