గుజరాత్‌లో ఘోర ప్రమాదం: 10 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 11:59 IST

గుజరాత్‌లో ఘోర ప్రమాదం: 10 మంది మృతి

ఆనంద్‌: గుజరాత్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్‌ జిల్లా ఇంద్రనాజ్‌ గ్రామానికి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఆనంద్‌ జిల్లాలోని తారాపూర్‌, అహ్మదాబాద్‌ జిల్లాలోని వటమన్‌ మీదుగా వెళ్లే రాష్ట్ర రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని తారాపూర్‌ పోలీసులు వెల్లడించారు.

‘‘ఒక చిన్నారితో సహా 10 మంది ప్రయాణిస్తున్న కారును అతివేగంగా ట్రక్కు ఢీకొట్టింది. కారులో ఉన్న 10 మంది అక్కడికక్కడే మరణించారు’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. నుజ్జునుజ్జైన కారు నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మరణించిన వారి వివరాల కోసం ఆరా తీస్తున్నామని వారు వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని