తిరుపతి లాడ్జిలో వృద్ధ దంపతుల ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 12/04/2021 01:28 IST

తిరుపతి లాడ్జిలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

తిరుపతి (నేర విభాగం): తిరుపతి రైల్వేస్టేషన్‌కు సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం వేదాంతంవారిపల్లికి చెందిన తుమాటి చిన్నపనాయుడు (73), రుక్మిణి (60) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా కొన్నేళ్ల కిందట వివాహం అయి ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. వారితో పాటే ఉంటున్న ఈ దంపతులిద్దరూ స్విమ్స్‌ ఆస్పత్రిలో వైద్యం కోసం ఈ నెల 7న తిరుపతి వచ్చారు.

రైల్వే స్టేషన్‌కు సమీపంలోని మానస లాడ్జిలో దంపతులు గది తీసుకున్నారు. ఉన్నట్టుండి శనివారం రాత్రి వారు విషం కలిపిన ఆహారం తీసుకుని ఆదివారం విగతజీవులుగా కనిపించారు. ఈ మేరకు తిరుపతి ఈస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కుమార్తెలు హిమబిందు, శేషిబిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శివప్రసాద్‌ రెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని