Tirumala: ఆత్మహత్య వల్లే అగ్ని ప్రమాదం
close

తాజా వార్తలు

Published : 08/05/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tirumala: ఆత్మహత్య వల్లే అగ్ని ప్రమాదం

దుకాణాల దగ్ధం వ్యవహారాన్ని తేల్చిన పోలీసులు

తిరుమల: మళ్లిరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం ద్వారానే తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. గత మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో శ్రీవారి ఆలయ సమీపంలోని అస్థాన మండపంలో గల దుకాణాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 షాపులు పూర్తిగా దగ్ధం కాగా మరో 8 దుకాణాలు పాక్షికంగా కలిపోయాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

తొలుత ఈ ఘటన షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిందని భావించినా.. ఆ తర్వాత మళ్లిరెడ్డి మృతిపై విచారణలో పలు అనుమానాలు తలెత్తాయి. పోలీసులు విచారణను లోతుగా చేయడంతో పలు ఆధారాలను సేకరించారు. తిరుచానూరుకు చెందిన మళ్లిరెడ్డి సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నాడని.. మరుసటి రోజు ఉదయం బంకులో పెట్రోలు పట్టుకుని షాపు నంబర్‌ 84లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ద్వారా నిర్ధారణకు వచ్చారు. మళ్లిరెడ్డి ఆమ్మహత్య కారణంగానే షాపులన్నీ దగ్ధమైనట్లు విచారణలో తేల్చారు. కుటుంబ కళహాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని