ఉపాధి అధికారిపై సర్పంచ్‌ పెట్రోల్‌ దాడి

తాజా వార్తలు

Updated : 14/07/2021 05:37 IST

ఉపాధి అధికారిపై సర్పంచ్‌ పెట్రోల్‌ దాడి

నిర్మల్‌: నిర్మల్‌లో ఉపాధి హామీ అధికారిపై సర్పంచ్‌ పెట్రోల్‌తో దాడి చేయడం కలకలం రేగింది. జిల్లాలోని కుబీర్‌లో అధికారి రాజుపై పాతసాల్వి గ్రామ సర్పంచ్‌ సాయినాథ్‌ పెట్రోల్‌తో దాడి చేసి నిప్పంటించాడు. అక్కడే ఉన్న ఇతర సిబ్బంది స్పందించి రాజుపై బకెట్లతో నీళ్లు పోశారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని దస్త్రాలు కాలిపోయాయి. గాయాలపాలైన రాజును చికిత్స నిమిత్తం భైంసాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సర్పంచ్‌తో పాటు అధికారి రాజు వేర్వేరుగా కుభీర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు అందజేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని