
ప్రధానాంశాలు
మైదుకూరు తెదేపా ఛైర్మన్ అభ్యర్థి అరెస్టు
మైదుకూరు, న్యూస్టుడే: కడప జిల్లా మైదుకూరు పురపాలక తెదేపా ఛైర్మన్ అభ్యర్థి ధనపాల జగన్ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల చర్యను నిరసిస్తూ ఆ పార్టీ జిల్లా నేతలు, ధనపాల జగన్ కుటుంబసభ్యులు పోలీసుస్టేషన్ వద్ద భైఠాయించి నిరసన తెలిపారు. ఈనెల 3న నామపత్రాల ఉపసంహరణ సమయం ముగిసిన తర్వాత వైకాపా నాయకులను కార్యాలయంలోకి అనుమతించడాన్ని గమనించిన ధనపాల జగన్ గదిలోకి చొచ్చుకుపోయి అధికారులను ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. స్టేషన్కు రావాలని శుక్రవారం రాత్రి ఆయనను పోలీసులు కోరారు. పదో తేదీ పోలింగ్ ముగిసిన తర్వాతే వస్తానని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అయితే, రావాల్సిందేనని పోలీసులు పట్టుబట్టడంతో ధనపాల జగన్ పోలీసుల వెంట బయటకొచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారికి సర్దిచెప్పి జీపులో ఎక్కించి తరలించారు. అనంతరం ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మరిన్ని
సినిమా
- Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
- కార్చిచ్చులా కరోనా
- India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ
- భారత్లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
