పాముతో భార్యను చంపిన భర్తకు రెండు జీవిత ఖైదులు

ప్రధానాంశాలు

Updated : 14/10/2021 16:25 IST

పాముతో భార్యను చంపిన భర్తకు రెండు జీవిత ఖైదులు

శిక్ష ఖరారు చేసిన కొల్లం జిల్లా కోర్టు

కొల్లం: పాము కాటుతో భార్యను చంపిన  కేసులో దోషిగా తేలిన భర్తకు.. కేరళలోని కొల్లం జిల్లా కోర్టు  రెండు జీవిత ఖైదులు విధించింది. దీంతో పాటు రూ.5.85లక్షల జరిమానా విధించింది. తీర్పు సందర్భంగా.. అత్యంత అరుదైన ఘటనల్లో ఇది ఒకటని సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.మనోజ్‌ పేర్కొన్నారు. కొల్లం జిల్లా అంచల్‌కు చెందిన సూరజ్‌ మరో అమ్మాయిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో భార్య ఉత్రాను చంపాలనుకున్నాడు. సురేష్‌ అనే పాములవాడికి డబ్బులు ఇచ్చి విష సర్పాన్ని తీసుకున్నాడు. ఇంటికి వచ్చి నిద్రపోతున్న భార్యపై ఆ పామును విసిరేయగా.. ఆమెను రెండు సార్లు కాటు వేసింది. దీంతో ఉత్రా ప్రాణాలు కోల్పోయింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన