ఏటీఎంలలో సొమ్ము కొట్టేశారు.. నిప్పు పెట్టించారు

ప్రధానాంశాలు

Published : 23/10/2021 04:30 IST

ఏటీఎంలలో సొమ్ము కొట్టేశారు.. నిప్పు పెట్టించారు

రూ.52.59 లక్షల దుర్వినియోగం

అయిదుగురి అరెస్టు

నెహ్రూసెంటర్‌ (మహబూబాబాద్‌), న్యూస్‌టుడే: మహబూబాబాద్‌లోని వివిధ బ్యాంకుల ఏటీఎంలలో జమచేయాల్సిన రూ.52.59 లక్షల నగదును సొంతానికి వాడుకున్న కేసులో అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6.70 లక్షల నగదు, రూ.23 లక్షల విలువైన భూపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. స్థానిక మిలిటరీ కాలనీకి చెందిన జడల నాగరాజు, నెక్కొండ మండలం పెద్దకొర్పోలుకు చెందిన రాజేందర్‌, గూడూరు మండలం తీగలవేణికి చెందిన ధారవత్‌ మహేశ్‌ రైటర్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ అనే కంపెనీలో ఏటీఎం ఆపరేటర్లు. వీరు వివిధ బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన రూ. 52,59,500 నగదును సొంతానికి వాడుకున్నారు. నాగరాజు రూ.42లక్షలు, రాజేందర్‌ రూ.9 లక్షలు, మహేశ్‌ రూ.1,59,500 తీసుకున్నారు. తప్పు కప్పి పుచ్చుకునేందుకు చిన్నగూడూరుకు చెందిన కృష్ణప్రకాశ్‌, తాళ్లపూసపల్లిలో ఉంటున్న యశ్వంత్‌, శనిగపురం వాసి రామ్‌చరణ్‌, ధర్మన్న కాలనీ వాసి సాయికుమార్‌, ఖమ్మంకు చెందిన ప్రసాద్‌లకు రూ.2లక్షలు ఇచ్చి ఈనెల 13న మార్వాడీ బజారులోని యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంను దహనం చేయించారని ఎస్పీ తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన