521 ఆర్బీకేల్లో రబీ ధాన్యం కొనుగోళ్లు
Published : 16/05/2021 05:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

521 ఆర్బీకేల్లో రబీ ధాన్యం కొనుగోళ్లు

రైతు సమస్యలు వింటున్న జేసీ మాధవీలత

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో 521 రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రబీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు జేసీ కె.మాధవీలత తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని ఆమె సూచించారు. నగరంలోని తమ విడిది కార్యాలయం నుంచి శనివారం ‘డయల్‌ యువర్‌ జాయింటు కలెక్టరు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 5,387 మంది రైతుల నుంచి రూ.143 కోట్ల విలువైన 76,945 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. మొత్తం 33 మంది రైతులు తమ సమస్యలను తెలియజేయగా, వాటిని నివృత్తి చేశారు. ముదినేపల్లి, మచిలీపట్నం, పెనమలూరు, గంపలగూడెం, చాట్రాయి, నందిగామ, జగ్గయ్యపేట, ఉంగుటూరు, తిరువూరు, వీరులపాడు, కంకిపాడు, పెడన, జి.కొండూరు, విజయవాడ గ్రామీణ, తోట్లవల్లూరు మండలాల నుంచి రైతులు మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ చేపట్టాలని కోరారు. దీనిపై జేసీ స్పందిస్తూ.. ఆయా రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్లి, పేర్లు, పంట వివరాలు తదితరాలను నమోదు చేసుకుని, ధాన్యం విక్రయించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు కె.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని