ఎన్టీఆర్‌ విగ్రహంపై మారోమారు రాళ్ల దాడి
logo
Published : 18/06/2021 02:38 IST

ఎన్టీఆర్‌ విగ్రహంపై మారోమారు రాళ్ల దాడి

రాళ్ల దెబ్బలతో విగ్రహం పెచ్చులూడిందిలా..

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: పట్టణంలోని నెహ్రూరోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహంపై మరోమారు దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో విగ్రహాన్ని కొంత మేర పగులగొట్టి ఉండడాన్ని స్థానికులు గురువారం ఉదయం గుర్తించారు. ఈ విషయం స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పగులగొడితే పోలీసులు విచారించి, మతి స్థిమితం లేని వ్యక్తి ఇలా చేశాడని గుర్తించారు. తర్వాత కమిటీ ఆధ్వర్యంలో పాత విగ్రహం స్థానంలో నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని గత ఏడాది సెప్టెంబరు 9న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఆవిష్కరించారు. వైకాపా ఎమ్మెల్యే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాగా ప్రస్తుత ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రెండో పట్టణ పోలీసులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని