ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారా?
logo
Published : 22/06/2021 04:13 IST

ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారా?

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు ఆందోళన నిర్వహిస్తే అరెస్ట్‌ చేయించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. కొత్త జాబ్‌ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి వెళుతున్న డీవైఎఫ్‌ఐ నాయకులు, నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని రామకృష్ణ పరామర్శించి పోరాటానికి మద్దతు తెలియజేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు, జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ, దోనేపూడి కాశీనాథ్‌, తూర్పు సిటీ కార్యదర్శి బోజెడ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని