స్వాతంత్య్ర దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష
eenadu telugu news
Published : 04/08/2021 01:13 IST

స్వాతంత్య్ర దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష

ఏర్పాట్లపై తలశిల రఘురామ్‌కు వివరిస్తున్న కలెక్టర్‌ నివాస్‌, పక్కనే వీఎంసీ

కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, జేసీ మాధవీలత, తదితరులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:  రాష్ట్ర స్థాయి 75వ స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణకు విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియం ప్రాంగణాన్ని సన్నద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. ఇందిరాగాంధీ స్టేడియంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ హాలులో మంగళవారం సాయంత్రం పలు శాఖల అధికారులతో సమీక్షించి, ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌, నగరపోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌తో కలిసి కలెక్టర్‌ జె.నివాస్‌ పరిశీలించారు. ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు. స్టేడియం ప్రాంగణం చుట్టూ త్రివర్ణ రంగులతో కూడిన క్లాత్‌తో అలంకరించాలని వీఎంసీ కమిషనర్‌కు సూచించారు. కవాతులో పాల్గొనే సిబ్బంది అందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. వారికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించి, వాటర్‌ ప్రూఫ్‌ షామియానాలు వేయాలన్నారు. మూడు ప్రవేశ ద్వారాల వద్ద ఎక్కువ స్థాయిలో థర్మల్‌ స్కానర్లు, శానిటేషన్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో సభా ప్రాంగణంలో నిరాటంకంగా విద్యుత్తు సరఫరా కల్పించాలని, జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రాజ్‌భవన్‌, రాష్ట్ర అతిథి గృహం, ఇతర ప్రధాన కార్యాలయ భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలన్నారు. నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ కొవిడ్‌ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆహ్వానితులు మాత్రమే పాల్గొంటారన్నారు. వీఐపీ పార్కింగ్‌లో ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రొటొకాల్‌ డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ కె.మోహన్‌కుమార్‌, డీసీపీ విష్ణువర్థన్‌రాజు, డీఆర్‌వో ఎం.వెంకటేశ్వర్లు, సబ్‌ కలెక్టరు జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని