వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌
eenadu telugu news
Published : 18/09/2021 03:26 IST

వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌


రాష్ట్ర కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్యకర్తలు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: మధ్యాహ్న భోజన పథక ఏజెన్సీ వర్కర్లకు వేతన బకాయిలు చెల్లించాలని భోజన పథక కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి స్వరూపరాణి డిమాండ్‌ చేశారు. పథక కార్మిక సంఘ సభ్యులు ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర కార్యాలయాల వద్ద శుక్రవారం నిరసన తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలుగా ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదన్నారు. వర్కర్లకు ఎలాంటి బీమా లేదన్నారు. గ్యాస్‌ సరఫరాను ప్రభుత్వాలు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌ మైధిన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.సుప్రజ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, మహేష్‌, రాజేశ్వరి, విజయలక్ష్మీ, మంగమ్మ, బుజ్జిలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని