ప్రతి మండలంలో జూడో క్లబ్‌లు
eenadu telugu news
Published : 20/09/2021 05:33 IST

ప్రతి మండలంలో జూడో క్లబ్‌లు


మాట్లాడుతున్న ఏపీ జూడో సంఘ ప్రధాన కార్యదర్శి వెంకట్‌

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రతి మండలంలో జూడో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ఏపీ జూడో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వెంకట్‌ నామిశెట్టి పేర్కొన్నారు. జిల్లా జూడో అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం ఆదివారం గుంటూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఛైర్మన్‌గా చంద్రశేఖరరెడ్డి, వైస్‌ ఛైర్మన్‌గా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా శ్రీదేవి, కోశాధికారిగా సాయిరామ్‌, సీఈవోగా రాంబాబు, ఉపాధ్యక్షులుగా విజయలక్ష్మి, బాలకృష్ణ, సైదారావు, నాగూర్‌, శేషగిరి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రభాకర్‌, సాంకేతిక కార్యదర్శిగా శివకృష్ణ, కార్యాలయ కార్యదర్శిగా రాజ్‌కమల్‌, మెడికల్‌ అడ్వైజర్‌గా అనూష, సంయుక్త కార్యదర్శులుగా అరవింద్‌, రవి, సుబాని, సుభాష్‌ కృష్ణ, జెక్రితో పాటు అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ శిక్షణ శిబిరాలను నిర్వహించాలని, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించాలని తీర్మానించారు. నూతన కార్యవర్గం సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించి జిల్లాలో జూడో క్రీడాభివృద్ధికి కృషి చేయాలని వెంకట్‌ కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని