శతక పద్య రచయిత ఉప్పులూరి రవికృష్ణశర్మ మృతి
eenadu telugu news
Published : 22/10/2021 06:07 IST

శతక పద్య రచయిత ఉప్పులూరి రవికృష్ణశర్మ మృతి

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే : నటుడు, శతక పద్య రచయిత, టీవీ, రేడియో కళాకారుడు, ఆధ్యాత్మికవేత్త ఉప్పులూరి రవికృష్ణశర్మ (61) గురువారం అజిత్‌సింగ్‌నగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి పేరుతో ఉప్పులూరి రాజారావు కళాపీఠం నెలకొల్పిన ఆయన.. నటులను సన్మానించేవారు. ఆయన మృతికి శ్రీవిజయకృష్ణ నాట్యమండలి అధ్యక్షుడు ఉప్పులూరి లక్ష్మీనారాయణ, చిలుకూరి బాబూరావు, టి.వి.సుబ్బారావు, వి.నారాయణ, మారుతీ గ్యాస్‌ అధినేత చెట్టపల్లి మారుతీ ప్రసన్న, ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు కె.గణేష్‌ కుమార్‌, తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు తదితరులు సంతాపం ప్రకటించారు. రవికృష్ణశర్మకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని