ఆమె ఆర్తనాదాలు  ఆలకించేదెవరు..?
eenadu telugu news
Updated : 16/09/2021 13:00 IST

ఆమె ఆర్తనాదాలు  ఆలకించేదెవరు..?

నిస్సహాయస్థితిలో అభాగ్యురాలు

ఒక కాకికి కష్టమొస్తే... కావు కావుమంటూ.. పది కాకులు చేరి సాయమందిస్తాయి. అలాంటిది.. సాటి మనిషి చావుబతుకుల మధ్య తల్లడిల్లుతుంటే.. మనకెందుకులే.. అంటూ ఎవరిదారినవారు వెళుతున్న ఉదంతమిది. మనిషిలోని మానవత్వాన్నే ప్రశ్నిస్తున్న హృదయ విదారక దృశ్యమిది. వివరాలు.. గుంతకల్లుకు చెందిన ఈమె పేరు సిద్ధమ్మ. పదేళ్ల కిందటే భర్త మరణించాడు. పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా మిగిలింది. కుష్ఠు ఆవహించడంతో దీనావస్థలో ఉంది. ఆమె రెండు చేతులు, ఒక కాలికి గాయాలై పురుగులు పడటంతో నాలుగురోజుల కిందట చికిత్స కోసం సర్వజన ఆసుపత్రికి వచ్చింది. వైద్య సిబ్బంది గాయాలకు కట్టుకట్టి చెట్టుకింద వదిలేశారు. ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు. నాలుగు రోజుల నుంచి ఆకలితో అలమటిస్తోంది. అన్నం పెట్టే దాతలున్నా.. తినిపించడానికి ఎవరూ ముందుకురావడం లేదు. కనీసం మంచి నీళ్లు తాపేవారూ లేరు. స్వచ్ఛంద సంస్థలైనా స్పందించి ఆమెకు ఆహారం అందిస్తే బతికి బట్టకడుతుంది. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. - న్యూస్‌టుడే, అనంత గ్రామీణం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని