Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం


కేకు కోసి సంబరాలు చేసుకుంటున్న తెదేపా నాయకులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ): తెదేపా జిల్లా కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేకు కోసి నాయకులు, కార్యకర్తలకు పంచి పెట్టారు. ఎమ్మెల్సీ బీఎన్‌ రాజసింహులు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధితో పాటు, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు ఎంతో కృషిచేశారన్నారు. ఆయన ఇలాంటి జన్మదినోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. పేద వాళ్లకు కూడు, గూడు లక్ష్యంగా తెదేపాను ఎన్టీఆర్‌ స్థాపించారని, ఆయన ఆశయ సాధనకు చంద్రబాబు కృషి చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యాలయ సమన్వయ కార్యదర్శి సురేంద్ర కుమార్‌, టౌన్‌ బ్యాంకు మాజీ ఛైర్మన్‌ షణ్ముగం, తెలుగురైతు జిల్లా మాజీ అధ్యక్షుడు మనోహర్‌నాయుడు, నాయకులు మోహన్‌రాజ్‌, వెంకటేష్‌ యాదవ్‌, మేషక్‌, కార్పొరేటర్‌ అశోక్‌, మాజీ కార్పొరేటర్లు మురుగ, శేషాద్రి, దుర్గాప్రసాద్‌, పార్టీ నగర మహిళాధ్యక్షురాలు వరలక్ష్మి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్‌, మైనారిటీ నాయకులు అత్తు, నవాజ్‌, ముజీబ్‌, ఫైరోజ్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని