అదృశ్యం కేసులుత్వరగా ఛేదించండి: డీఐజీ
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

అదృశ్యం కేసులుత్వరగా ఛేదించండి: డీఐజీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : అదృశ్యం కేసులను త్వరగా ఛేదించాలని గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ త్రివిక్రమ వర్మ అన్నారు. బుధవారం డీఐజీ తన కార్యాలయం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా రేంజ్‌ పరిధిలోని అధికారులతో అదృశ్యం కేసులపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు, వాటి దర్యాప్తు దశపై అడిగి తెలుసుకున్నారు. బాలికల అదృశ్యం కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందుకు గ్రామ స్థాయిలో మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చూడాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని