Published : 21/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అక్రమంగా నిర్మించిన రహదారి తొలగింపు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: ‘అనుమతి లేని దారి.. అధికారులు చూడరు మరి’ శీర్షికన మంగళవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి దేవాదాయ, రెవెన్యూ అధికారులు స్పందించి తొలగించారు. దోమ మండలం గూడూరు సర్వే నంబరు 67లో అనంతగిరి పద్మనాభస్వామి ఆలయానికి 5.18 ఎకరాలు, సర్వే నంబరు 66లో సంజీవ స్వామి ఆలయానికి 14 ఎకరాలు ఉన్నాయి. ఆయా భూముల నుంచి ఓ వెంచరు కోసం అనుమతి తీసుకోకుండా రోడ్డు వేస్తున్న వైనాన్ని వెలుగులోకి తేవడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు, ఈఓ శేఖర్‌గౌడ్‌, తహసీల్దార్‌, ఇతర సిబ్బంది సంఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని