‘సాలార్‌జంగ్‌’ భద్రత భేష్‌
eenadu telugu news
Published : 27/07/2021 02:41 IST

‘సాలార్‌జంగ్‌’ భద్రత భేష్‌

పార్లమెంటరీ స్థాయీసంఘం సంతృప్తి

ఈనాడు, దిల్లీ: నగరంలోని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో భద్రతా ఏర్పాట్ల పట్ల టీజీ వెంకటేష్‌ నేతృత్వంలోని పర్యాటక, సాంస్కృతిక శాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. సోమవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. అగ్నిప్రమాదం, విధ్వంస ఘటనలను ఎదుర్కోవడానికి దేశంలోని అన్ని మ్యూజియాలూ తగిన భద్రతా చర్యలు చేపట్టాయి. సాలార్‌జంగ్‌ మ్యూజియంలోనూ ఆధునిక భద్రతా పరికరాలతోపాటు, 100 మంది సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించారు. కళాఖండాలపై కాలుష్య ప్రభావం తగ్గించడానికి చర్యలు చేపడుతోంది.’’అని స్థాయీసంఘం పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని