సురక్షిత ప్రయాణమూ.. పండగే
eenadu telugu news
Updated : 14/10/2021 22:19 IST

సురక్షిత ప్రయాణమూ.. పండగే

సొంత వాహనాల్లో వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి

ఈనాడు, హైదరాబాద్‌

దసరా పండగను సొంతూళ్లో జరుపుకొనేందుకు నగరవాసులు ఎంతటి ప్రయాసనైనా లెక్క చేయకుండా వెళ్తున్నారు. రైళ్లు, బస్సులు నడుస్తున్నా.. సొంత వాహనాల్లో వెళ్లేవారికి కొదవలేదు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, బెంగళూరు, వరంగల్‌ జాతీయ రహదారుల్లో ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా సాగుతుంటాయి. పండగ సమయాల్లో ఆయా రహదారుల్లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ఆయా రహదారుల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాల విషయంలో అవగాహనతో అప్రమత్తంగా వెళ్లాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులు సూచిస్తున్నారు.

కార్లను సరి చూసుకోండి..

ఇంజిన్‌ వేడెక్కితే కారు ఆగిపోతుంది తప్ఫ. ఎట్టి పరిస్థితుల్లోనూ తగలబడవు. కేవలం హెడ్‌లైట్లు, ఊఫర్లు కారు కంపెనీలు ఇచ్చిన సామర్థ్యం కంటే ఎక్కువ కిలోవాట్స్‌ పవర్‌ ఉన్నవి వాడడం వల్ల వైర్లు మెల్టయి.. షార్టు సర్క్యూట్‌ వల్ల కార్లలో మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇలా దూర ప్రాంతాల ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరి. ఇంజిన్‌ ఆయిల్‌ సరిపడా ఉండాలి. కూలెంట్‌, బ్రేక్‌ ఆయిల్స్‌, బ్రేక్‌ ప్యాడ్స్‌, లైనర్స్‌ చెక్‌ చేయించుకోవాలి.

‘సుఖద్‌ యాత్ర’ యాప్‌ తోడుంటే..

జాతీయ రహదారికి సంబంధించిన ‘సుఖద్‌యాత్ర’ అనే అధికారిక యాప్‌ను మీ సెల్‌ఫోనులో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే.. అనేక సేవలు మీకు అందుబాటులోకి వస్తాయి. మీరెళ్లే మార్గంలో ఎన్ని టోల్‌గేట్లున్నాయి.. ఎంత చెల్లించాల్సి వస్తుంది.. ఫాస్టాగ్‌ సేవలతోపాటు రహదారి మరమ్మతుల సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఏటీఎంలు, హోటళ్లు, పెట్రోల్‌ పంపుల వివరాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

జాతీయ రహదారుల్లో జర భద్రం..

నగరంలో అడుగడుగునా ట్రాఫిక్‌ జామ్‌లతో నలిగిపోయిన వారు జాతీయ రహదారుల్లో మితిమీరిన వేగంతో వెళ్తుంటారు. సొంతూరు ఎంత త్వరగా చేరాలని ఉన్నా వేగాన్ని తమాయించుకోవడం అవసరం. సాధ్యమైనంతవరకూ పగటిపూటే ప్రయాణాన్ని పెట్టుకోవాలి.

జాతీయ రహదారుల్లో ఎలాంటి సహాయం కావాలన్నా.. తక్షణం స్పందించే ఫోను నంబరు 1033

ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలు

విజయవాడ జాతీయ రహదారిలో..

1. పెద్దఅంబర్‌పేట కూడలి

2. అవుటర్‌ రింగురోడ్డు

3. అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి

4. ఇనాంగూడ

5. బాటసింగారం

6. కొత్తగూడెం

7. దండుమైలారం క్రాస్‌రోడ్డు

8. టైక్స్‌టైల్‌ పార్కు కూడలి

9. చౌటుప్పల్‌ బస్టాండు

10. తంగడపల్లి రోడ్డు

11. వలిగొండ రోడ్డు

12. అరెగూడెం క్రాస్‌రోడ్డు

13. పిట్టంపల్లి క్రాస్‌రోడ్డు

14. పెద్దకాపర్తి చెరువుకట్ట యూటర్న్‌

15. చిట్యాల రైల్వేస్టేషన్‌ చౌరస్తా

16. గోపలాయపల్లిస్టేజీ

17. ఎర్రసానిగూడెం స్టేజీ

18. మాణిక్యాలగూడెం

19. కట్టంగూరు నల్గొండ ఎక్స్‌రోడ్డు

20. అయిటిపాముల

21. చందుపట్ల స్టేజీ

22. ఇనుపాముల జంక్షన్‌

23. టేకుమట్ల

24. పిల్లలమర్రి స్టేజీ

25. జనగామ క్రాస్‌రోడ్డు

26. శాంతినగర్‌

27. దురాజ్‌పల్లి

28. గుంపుల

29. మాధవరం

30. ఆకుపాముల

31. కొమరబండ

32. కేకేగూడం

33. దుర్గాపురం

34. గరికపాడు(ఏపీ)

35. నందిగామ

వరంగల్‌ జాతీయ రహదారిలో...

1. చెంగిచెర్ల చౌరస్తా

2. సీపీఆర్‌ఐ

3. జోడిమెట్ల

4. యంనంపేట

5. అంకుషాపూర్‌

6. అవుషాపూర్‌ కూడలి

7. గూడూరు

బెంగళూరు జాతీయ రహదారిలో...

1. తొండుపల్లి గేటు

2. రైల్వే పైవంతెన

3. గండిగూడ బస్టాపు

4. ఘాన్సిమియాగూడ స్టేజీ

5. పెద్దషాపూర్‌

6. చెక్‌పోస్టు

7. మదనపల్లి దర్గా

8. పాల్మాకుల

9. చేగూరు జంక్షన్‌

10. కొత్తూరు వై జంక్షన్‌

11. నాట్కో కూడలి

12. దండకుంట తండా

13. డాల్ఫిన్‌ తండా

14. మూసాపేట

15. అడ్డాకుల

16. బాలానగర్‌

17. పెద్దాయిపల్లి

18. కేతిరెడ్డిపల్లి

19. రంగారెడ్డిగూడ

20. ముదిరెడ్డిపల్లి

21. జడ్చర్ల

22. భూత్పూర్‌

23. కొత్తకోట


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని