వృద్ధురాలిపై ఆవు దాడి.. తీవ్ర గాయాలు
eenadu telugu news
Published : 24/10/2021 02:08 IST

వృద్ధురాలిపై ఆవు దాడి.. తీవ్ర గాయాలు

జవహర్‌నగర్‌: నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిపై ఆవు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లో శనివారం జరిగింది. ఈ ఘటన చిత్రాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌ ఫైరింగ్‌రేంజ్‌ శాంతినగర్‌కు చెందిన పోచమ్మ (70), కుమారుడు లక్ష్మణ్‌తో ఉంటున్నారు. వారి ఇంటి సమీపంలోనే పోచమ్మ సోదరి నివసిస్తోంది. శనివారం ఉదయం సోదరి ఇంటికి వెళ్తుండగా ఆవు అకస్మాత్తుగా పోచమ్మపై దాడి చేసింది. కొమ్ములతో ఆమెను పైకి ఎత్తి పడేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108లో గాంధీకి తరలించి అత్యవసర చికిత్స చేశారు. గతంలోనూ ఈ ఆవు నాలుగేళ్ల బాలుడితో పాటు పలువురిపై దాడికి పాల్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని