నాలుగు చోట్ల కొత్త డంపింగ్‌ యార్డులు
eenadu telugu news
Published : 24/10/2021 02:21 IST

నాలుగు చోట్ల కొత్త డంపింగ్‌ యార్డులు

డంపింగ్‌యార్డులో మేయర్‌ విజయలక్ష్మి, అర్వింద్‌కుమార్‌ ఇతర అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: జవహర్‌నగర్‌ చెత్త డంపింగ్‌ యార్డు కారణంగా చుట్టుపక్కలున్న 18 గ్రామాల వాసులు పడుతున్న ఇబ్బందులపై ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు దృష్టిసారించారు. డంపింగ్‌యార్డు నిర్వహణ లోపాలు, ప్రజలు పడుతున్న సమస్యలపై శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి జీహెచ్‌ఎంసీ పాలనా యంత్రాంగం స్పందించింది. నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌, జవహర్‌నగర్‌ మేయర్‌ కావ్య, డంపింగ్‌ యార్డు నిర్వహించే రాంకీ సంస్థ ఉన్నతాధికారి మసూద్‌ మల్లిక్‌ తదితరులు శనివారం యార్డును పరిశీలించారు. వచ్చే చెత్త.. యార్డు సామర్థ్యానికి మించి ఉండటంతో నిర్వహణలో లోపాలు తలెత్తున్నట్లు గుర్తించారు. నిల్వ ఉన్న 1.5 లక్షల టన్నుల వ్యర్థాల నుంచి దుర్వాసన వెలువడుతోందన్నారు. ప్రస్తుతమున్న విద్యుదుత్పత్తి కేంద్రానికి అదనంగా రూ.700 కోట్లు వెచ్చించి మరో 28 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. నిల్వ వ్యర్థాలపై డ్రోన్లతో మందు పిచికారి చేస్తామని, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. చేపట్టిన చర్యలను 15 రోజులయ్యాక తనిఖీ చేస్తామన్నారు. అర్వింద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి సామర్థ్యానికి మించి వ్యర్థాలొస్తుండడం వల్ల త్వరలోనే మరో 4 చోట్ల డంపింగ్‌ యార్డులు నెలకొల్పుతామని’ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని