దారి ఎక్కడికి వెళ్తుందని అడిగి దాడి చేశారు
eenadu telugu news
Published : 26/10/2021 06:13 IST

దారి ఎక్కడికి వెళ్తుందని అడిగి దాడి చేశారు

 


ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న రాజు

మోమిన్‌పేట: ఈ దారి ఎక్కడికి వెళ్తుందని అడిగి ఓ వ్యక్తిపై గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు దాడి చేసి చరవాణి, పర్సు లాక్కున్న సంఘటన మోమిన్‌పేట ఠాణా పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి బాధితుడు, మోమిన్‌పేట వలయాధికారి వెంకటేశం, స్థానికులు తెలిపిన వివరాలు... మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో ఓ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న రాజు ఆదివారం సాయంకాలం గ్రామంలోని బంధువుల దగ్గరికి తన ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. కొంత సేపటి తరువాత తిరిగి బయలుదేరాడు. ఆ సమయంలో అదే మార్గంలో వెనుక నుంచి నలుగురు వ్యక్తులు కారులో వచ్చి రాజును ఈ దారి గుండా వెళ్తే ఎక్కడి వెళ్తామని అడిగారు. శంకర్‌పల్లి వెళ్లొచ్చని చెబుతూ తన వాహనాన్ని అతను ముందుకు నడిపించసాగాడు. అతనికి అడ్డంగా కారును నిలిపి కత్తి, సుత్తెలతో వారు దిగారు. మరో వ్యక్తి బీరు సీసాను పగలగొట్టి దాడి చేసి డబ్బులు ఎన్ని ఉన్నాయో ఇవ్వాలని బెదిరించారు. రెండు వందల రూపాయలు ఉన్న పర్సును జేబులోంచి తీసి ఇస్తుండగా చరవాణిని లాక్కొన్నారు. ద్విచక్ర వాహనం తాళాలు సైతం తీసుకొని వెనక్కు తిరిగి మోమిప్‌పేట వైపు వెళ్లిపోయారు. వాహనాన్ని తోసుకుంటూ రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనను గ్రామస్థులకు తెలిపారు. అదే రాత్రి కొందరు గ్రామస్థుల సహాయంలో ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసినట్టు రాజు చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేయడం కోసం రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు మోమిన్‌పేట వలయాధికారి వెంకటేశం తెలిపారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని