భారత్‌ బంద్‌ ప్రశాంతం
eenadu telugu news
Updated : 27/09/2021 20:40 IST

భారత్‌ బంద్‌ ప్రశాంతం

కలసపాడు: కలసపాడులో సోమవారం ప్రజా సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మూడు రోడ్ల కూడలిలో ప్రజా సంఘాల నాయకులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణాలను వ్యాపార సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. జిల్లా కేవీపీఎస్‌ సభ్యుడు ప్రవీణ్‌ కుమార్‌, సీపీఎం, సీపీఐ కార్యదర్శులు గుర్రయ్య, జాకోబ్‌ మాట్లాడుతూ... రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు. దేశ సంపదను కార్పొరేట్‌, పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్న భాజపా ప్రభుత్వ విధానాల నుంచి దేశాన్ని కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి విజయమ్మ, ఆవాజు మండల అధ్యక్షుడు హుసేన్‌ పిరా తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని