ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబి
eenadu telugu news
Published : 20/10/2021 04:42 IST

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబి


ప్రొద్దుటూరులో ఊరేగింపు నిర్వహిస్తున్న ముస్లిం సోదరులు

మహమ్మద్‌ ప్రవక్త సూచించిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడచుకోవాలని పీఠాధిపతులు సూచించారు. మిలాన్‌ ఉన్‌ నబి పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాయచోటిలలో ముస్లిం సోదరుల ర్యాలీ కొనసాగింది. కులమతాలకు అతీతంగా ఇతరుల పట్ల ప్రేమాభిమానులతో ఉండేలా ప్రవక్త మానవాళికి సూచించారని పీఠాధిపతులు ప్రసంగించారు. ప్రభుత్వాసుపత్రుల్లో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. మహమ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా కేకుకోసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగుల్లో జరిగిన ర్యాలీలను చిత్రాల్లో చూడవచ్ఛు- న్యూస్‌టుడే, జిల్లా బృందం

జమ్మలమడుగులో ఆస్థానే గౌసియా పీఠాధిపతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని