Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రమాదవశాత్తు కారు దగ్ధం

కారు ఇంజిన్‌ నుంచి మంటలు వస్తున్న దృశ్యం

ధర్మారం, న్యూస్‌టుడే: ధర్మారం-కరీంనగర్‌ ప్రధాన రహదారిపై మల్లాపూర్‌ బస్టాప్‌ వద్ద మంగళవారం కారు ముందు భాగంలో మంటలు రావడంతో దగ్ధమైంది. కరీంనగర్‌కు చెందిన రాపల్లి రమేష్‌ పని నిమిత్తం ధర్మపురికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. మల్లాపూర్‌ స్టేజీ వద్దకు రాగానే కారు ముందుభాగంలో నుంచి పొగలు రావడంతో ఆపాడు. అంతలోనే మంటలు రావడంతో వెంటనే కారు నుంచి బయటకు వచ్చాడు. క్షణాల్లో మంటలు చెలరేగాయి. మల్లాపూర్‌ ఉపసర్పంచి శ్రీనివాస్‌ చొరవతో పంచాయతీ ట్యాంకరుతో మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక వాహనం చేరుకుంది. ఘటనా స్థలాన్ని ఎస్సై శ్రీనివాస్‌ పరిశీలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని