ఏడాదిలోగా ధర్మపురిలో అభివృద్ధి పనులు
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

ఏడాదిలోగా ధర్మపురిలో అభివృద్ధి పనులు


వేదికపై నుంచి మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి, న్యూస్‌టుడే : ధర్మపురిలో రూ.వంద కోట్లతో టెంపుల్‌ సిటీ అభివృద్ధి పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆదివారం రాత్రి గణేశ్‌ నిమజ్జన వేదికపై నుంచి వినాయక విగ్రహాలకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది కరోనాతో అనేక ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొన్నారని, ఈ ఏడాది ఉత్సాహంగా భక్తులు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బత్తిని అరుణ, పుర అధ్యక్షురాలు సంగి సత్తెమ్మ, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ అయ్యోరి రాజేష్‌, ఉపాధ్యక్షుడు ఇందారపు రామయ్య, పుర కమిషనర్‌ సీహెచ్‌ రమేష్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని