close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

తాజా వార్తలు

అత్తెసరు నిధులే..

డైట్‌ బిల్లులకు రూ. 1.45 కోట్లు విడుదల

ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గిరిజన కళాశాల వసతిగృహాల్లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి డైట్‌ బిల్లుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క నెల కూడా డైట్‌ బిల్లులను ఆ శాఖాధికారులు విడుదల చేయలేదు. దీంతో సంక్షేమాధికారులే తమ సొంత డబ్బులు వెచ్చించి విద్యార్థులకు మెనూను అందిస్తున్నారు. డిసెంబరు 2019 వరకు ఖమ్మం జిల్లాకు రూ.6.70కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలను పంపించారు. కాగా జిల్లాకు రూ.1,45,19,250 విడుదల చేశారు. ఈ మొత్తం వసతిగృహాలకు ఎంతమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. ఇవి జూన్‌, జులై నెలకు మాత్రమే సరిపోతాయని వసతిగృహ సంక్షేమాధికారులు వాపోతున్నారు. మిగిలిన నిధులను కూడా సాధ్యమైనంత త్వరగా అందించాలని కోరుతున్నారు.

● జిల్లాలో గిరిజన కళాశాల స్థాయి

వసతిగృహాలు: 12

● విద్యార్థుల సంఖ్య: 2850

● అవసరమైన నిధులు: రూ.6.70కోట్లు

విడుదల చేసినవి: రూ.1.45కోట్లు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.