పూర్తిస్థాయిలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు
logo
Published : 20/06/2021 03:41 IST

పూర్తిస్థాయిలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు

ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను నేటినుంచి ఎత్తివేయడంతో టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఆదివారం నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో ప్రయాణికులకు సేవలందించేందుకు రోడ్డెక్కనున్నాయి. లాక్‌డౌన్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగడంతో 250 ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కేవి. ఆ సంఖ్య 302కు పెరగనుంది. ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కనుండగా, అద్దెబస్సుల వినియోగంపై ఆర్టీసీ అధికారులు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా నడవవని అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కనుండటంతో జిల్లాలోని గ్రామాలకు బస్సులు వెళ్లనున్నాయి. నిన్నమొన్నటి వరకు పట్టణప్రాంతాలకు చేరడానికి ఇబ్బందులు పడిన గ్రామీణప్రాంత ప్రజలకు ఈ నిర్ణయంతో వారి ప్రయాణ, రవాణా కష్టాలు తీరనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని