
కొలువులు ఖాళీ.. అనర్హులే ఇస్తారు మందు గోళీ
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు అందజేస్తున్న యువతి
నంద్యాల పాతపట్టణం, న్యూస్టుడే: ఒక ఔషధ దుకాణంలో పని చేయాలంటే ఫార్మసీ చదివి ఉండాలి. వారైతేనే మందులు ఇవ్వడానికి అర్హులు. అలాంటిది ఎలాంటి అర్హత లేకుండా డిగ్రీ చదివిన ఓ యువతితో రోగులకు మందులు పంపిణీ చేయిస్తున్నారు నంద్యాల జిల్లా ఆసుపత్రి అధికారులు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులిగా పని చేస్తున్న ఓ మహిళ కుమార్తెకు రెండు నెలలు మందులపై అవగాహన కల్పించి వచ్చే రోగులకు ఆమెతో మందులు ఇప్పిస్తుండటం గమనార్హం. ఈ ఆసుపత్రిలో మొత్తం నాలుగు ఫార్మాసిస్టు పోస్టులు, ఔషధ పర్యవేక్షణాధికారి పోస్టు గతేడాది నుంచి ఖాళీగా ఉన్నాయి. వైద్యాధికారులు వాటిని భర్తీ చేయడానికి ప్రతిపాదనలు పంపిన దాఖలాలు లేవు. వాటిని భర్తీ చేసి రోగులకు అర్హులతో మందులు అందజేయాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉంది.
Tags :