ఉచిత విద్యుత్తుకు దరఖాస్తులు 678
eenadu telugu news
Published : 05/08/2021 02:07 IST

ఉచిత విద్యుత్తుకు దరఖాస్తులు 678

జిల్లాలోని రజక, నాయీబ్రాహ్మణులకు అవకాశం

న్యూస్‌టుడే, మెదక్‌

వివరాలు నమోదు చేస్తున్న జిల్లా అధికారి జగదీశ్‌

కులవృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న రజక, నాయీబ్రాహ్మణులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందించాలని నిర్ణయించింది. సెలూన్లు, ఇస్త్రీ దుకాణాలతో పాటు దోబీఘాట్‌లకు ప్రతి నెలా 250 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించే వారికి ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. 2021-22 ఆర్థికసంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించగా, జూన్‌ 1 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ మేరకు http://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సర్కారు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు నాయీబ్రాహ్మణులు 335 మంది, రజకులు 340 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసే సమయంలో విద్యుత్తు బిల్లుపై ఉన్న యూనిక్‌ సర్వీస్‌ కోడ్‌(్య(‘్శ నమోదు చేయాలి. ఈ విషయం తెలియక చాలా మంది బిల్లులో ఉన్న సర్వీసు నంబర్‌ను నమోదు చేస్తున్నారు. దీనివల్ల పథకానికి అనర్హులు అయ్యే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఎడిట్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు మీ-సేవ కేంద్రానికి వెళ్లి యూఎస్‌సీ నంబర్‌ను చేర్చాలని అధికారులు సూచించినా స్పందన లేకపోవడంతో కలెక్టరేట్‌లో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఆయా దరఖాస్తులలో యూఎస్‌సీ నంబర్‌ను నమోదు చేస్తున్నారు. జూన్‌, జులై నెలకు సంబంధించి రజక, నాయీబ్రాహ్మణులు నిర్వహిస్తున్న దుకాణాలకు సంబంధించి విద్యుత్తు బిల్లులను వసూలు చేయరాదని ప్రభుత్వం ఆయా జిల్లాల ట్రాన్స్‌కో ఎస్‌ఈలకు ఆదేశాలు జారీ చేసింది.

కొత్త మీటర్లకు అవకాశం..

పలువురు కేటగిరి-1 (గృహ) విద్యుత్తు బిల్లులను జతపరుస్తున్నారు. వారి దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు తిరిగి వాటిని కొత్త మీటర్లకు కిందకు పరిగణించి.. ఉచితంగానే మీటర్లు అందజేసేలా చర్యలు తీసుకోనున్నారు. వీరందరికి కేటగిరి-2 కింద కనెక్షన్‌ను పరిగణించి మీటరు ఇవ్వనున్నారు.


సద్వినియోగం చేసుకోవాలి

- జగదీశ్‌, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి

రఖాస్తులను స్వీకరిస్తున్నాం. ఇంకా నమోదుకు అవకాశం ఉంది. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి. కేటగిరి-2 కింద మీటర్లు లేని వారికి తమశాఖ ద్వారా ఉచితంగా మీటర్లను ఇవ్వనున్నాం. అన్ని ధ్రువపత్రాలను జతపరిచి, యూఎస్‌సీ సంఖ్యను తప్పకుండా నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని