కూచారంలో బీ కేటగిరీ పరిశ్రమల ఏర్పాటుపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ
eenadu telugu news
Published : 25/10/2021 02:28 IST

కూచారంలో బీ కేటగిరీ పరిశ్రమల ఏర్పాటుపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: మండలంలోని కూచారంలో ఉన్న టీఎస్‌ఐఐసీ పారిశ్రామికవాడలో కొత్తగా ‘బీ’ కేటగిరీ (కాలుష్య కారక) పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సోమవారం ప్రజాభిపాయ్ర సేకరణ చేపట్టనున్నట్లు రామచంద్రాపురం కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవికుమార్‌ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా అదనపు పాలనాధికారి రమేష్‌, ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, టీస్‌ఐఐసీˆ జోనల్‌ మేనేజర్‌ మాధవి పాల్గొంటారు. కాళ్లకల్‌, ముప్పిరెడ్డిపల్లి, కూచారం గ్రామాల్లో 2006లో 891 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు చేయగా అందులో మూడు కేటగిరీలుగా విభజించిందన్నారు. కూచారం పరిధిలో కేటగిరీ బీ పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో సాయి మానస నేచర్‌టెక్‌ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు గ్రామసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని