భార్యను పుట్టింటికి పంపారని మనస్తాపం
eenadu telugu news
Published : 27/07/2021 04:05 IST

భార్యను పుట్టింటికి పంపారని మనస్తాపం

పురుగు మందు తాగి భర్త బలవన్మరణం

కేతేపల్లి, న్యూస్‌టుడే: తాను నిరాకరించినప్పటికీ తన భార్యను పుట్టింటికి పంపారనే ఆవేదనతో కేతేపల్లిలో ఓ యువకుడు బలవన్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కేతేపల్లికి చెందిన బందా బాలరాజు కుమారుడు తంబి జోసఫ్‌(25) అనే యువకునికి ఏడు నెలల క్రితం వివాహమైంది. వివాహమైన నాటినుంచి సంప్రదాయం ప్రకారం దంపతుల మధ్య రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈనెల 25వ తేదీ నుంచి కొత్తకోడలు అత్తవారింట్లో ఉండకూడదనే ఆచారంతో యువతి తల్లిదండ్రులు యువతిని పుట్టింటికి తీసుకుపోయేందుకు వచ్చారు. ఈ క్రమంలో యువతిని పుట్టింటికి పంపే విషయమై వాదోపవాదాలు జరిగాయి. అయినా యువతి తల్లిదండ్రులు ఆమెను తీసుకుపోయారు. ఈ విషయమై తీవ్ర మనస్తాపానికి గురైన తంబిజోసఫ్‌ ఆదివారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స జరుపుతుండగానే అతడు మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని కేతేపల్లి ఏఎస్సై అంజయ్య వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని