సరికొత్తగా సేకరణ
eenadu telugu news
Published : 21/10/2021 06:20 IST

సరికొత్తగా సేకరణ

నాణ్యత పరిశీలన ఏఈవోలకు.. రెండేళ్లుగా కేంద్రాల్లో ధాన్యం నాణ్యత పరిశీలించే బాధ్యతలను ప్రభుత్వం ఏఈవోలకు అప్పగించింది. వారు సిబ్బందికి అప్పజెప్పి చేతులు దులుపుకొంటున్నారు. రైసుమిల్లర్లు ధాన్యం నాణ్యతగా లేవని తరుగు తీస్తున్నారు. ఈ సీజన్‌లో ఏఈవోలు తప్పనిసరిగా పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాతే కాంటాలు వేయాలని నిర్దేశించింది.

 

కాంటాల వరకే రైతుల బాధ్యత.. కొన్నేళ్లుగా కేంద్రాల్లో ధాన్యం కాంటాలు పూర్తయి రైసుమిల్లులకు తరలించే వరకు సంచుల బాధ్యతను రైతులపైనే మోపేవారు. ప్రస్తుతం కాంటాల పూర్తయిన పిదప కేంద్రాల నిర్వాహకులే చూసుకోవాలని పేర్కొంది..
ట్రక్‌షీట్లలో మార్పులు చేస్తే చర్యలు.. తూకం వేసిన తరువాత రైసుమిల్లుల్లో  మరోమారు నాణ్యత పరిశీలించడంతో పాటు తరుగు తీస్తూ ట్రక్‌షీట్లలో మార్పులు చేస్తున్నారు. నిబంధనల మేరకు ఈ అధికారం వారికి లేనప్పటికీ కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కయి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ప్రస్తుతం ట్రక్‌షీట్‌లో మార్పులు చేస్తే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.


నిబంధనలకు అనుగుణంగా..  జితేంద్ర ప్రసాద్‌, డీఎం, పౌరసరఫరాలశాఖ
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ధాన్యం కొనుగోళ్లు చేపడతాం. ప్రస్తుతం 80 లక్షల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో గతేడాది మాదిరిగానే 343 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి. రెండు మూడు రోజుల్లో  కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం.


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని