కళలను కాపాడుకోవాలి:ఎమ్మెల్యే
eenadu telugu news
Published : 27/07/2021 04:04 IST

కళలను కాపాడుకోవాలి:ఎమ్మెల్యే


పరికరాలు అందజేస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి, అధికారులు

హిరమండలం, న్యూస్‌టుడే: సంప్రదాయ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేర్కొన్నారు. సోమవారం మండల పరిషత్తు కార్యాలయంలో డప్పు వాయిద్య కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసే వాయిద్య పరికరాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బలహీన, బడుగు వర్గాలకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. ఎంపీడీవో ఎం.ప్రభావతి, తహసీల్దారు టి.సత్యనారాయణ, ఉద్యోగులు, వైకాపా మండల కన్వీనర్‌ శంకరరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు సురేష్‌, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

పాతపట్నం: కొవిడ్‌ నివారణకు టీకా వేసుకోవడం ఒక్కటే మార్గమని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. సోమవారం పాతపట్నం సచివాలయం-3 పరిధిలో నిర్వహిస్తున్న టీకా కేంద్రాన్ని పరిశీలించారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్‌కు అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరిన్ని టీకాలు వేసేందుకు అవకాశం ఉందని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఎల్‌ఎన్‌పేట: వ్యాక్సిన్‌తోనే కరోనా దూరమవుతుందని ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ కె.రామారావు పేర్కొన్నారు. కరకవలసలో మెగా వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని