సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్తా
eenadu telugu news
Published : 28/09/2021 04:33 IST

సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్తా


తంపర భూముల పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌

తంపరలో భూములు ఉన్న రైతుల సమస్యలను ప్రధాని దృష్టికితీసుకెళ్తానని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్‌ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఉరజాం వచ్చిన ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి ముంపునకు గురైన సుసారం, ప్రియాగ్రహారం, డీఎల్‌పురం, సత్రవుపేట గ్రామాలకు వెళ్లి తంపరభూములు చూసి అక్కడి రైతులతో మాట్లాడారు. ఈసందర్భంగా మాధవ్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఇలాంటి సమస్య పలుచోట్ల ఉన్నట్లు కార్యకర్తలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రధాని సూచనల మేరకు తాను ఈ పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం తెల్లకార్డులు ఉన్నవారికి ఉచితంగా బియ్యం అందజేస్తోందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, జిల్లా కార్యదర్శి అట్టాడ రవిబాబ్జీ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, సుసరాం(పోలాకి)


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని