Published : 14/02/2020 13:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీమా చేయించి.. బాబాయ్‌ని చంపి..

సూర్యాపేట: సూర్యాపేటలో దారుణం వెలుగులోకి వచ్చింది. బీమా డబ్బుల కోసం సొంత బాబాయినే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట మండలం మునగాల మండలం తాడ్వాయికి చెందిన సైదులు ఈ నెల 24న వాహనం ఢీకొట్టి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో మృతుడి పేరు మీద రూ.50లక్షలు బీమా ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఒంటరిగా ఉంటున్న వ్యక్తికి ఇంత పెద్ద మొత్తంలో బీమా ఎవరు చేయించారన్న అనుమానంతో మరింత లోతుగా దర్యాప్తు చేయించగా.. అసలు విషయం బయటపడింది. మృతుడి అన్న కుమారుడు రమేశ్‌ ఫైనాన్స్‌లో నాలుగు లారీలు కొని అప్పుల పాలయ్యాడు. అప్పుల బాధను భరించలేక తానే సైదులుపై బీమా చేయించి పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 24న కొందరు స్నేహితులతో కలిసి బొలేరో వాహనంతో సైదులును ఢీకొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు.

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని