Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరికరాలపై ఆరా

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేజీహెచ్‌లో వైద్య పరికరాల నిర్వహణకు సంబంధించి వరసగా రెండో రోజు ఆదివారం సీఐడీ అధికారులు విచారణ కొనసాగించారు. గతంలో టీబీఎస్‌ సంస్థ వైద్య పరికరాల నిర్వహణ చేపట్టిన సమయంలో పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అనిశా చేపట్టిన విచారణ నివేదిక ఆధారంగా ప్రస్తుతం సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరికరాల విలువ కంటే నిర్వహణ ఖర్చులు అధికంగా కోట్‌ చేసి అప్పట్లో గుత్తేదారు సంస్థకు ప్రభుత్వం మేలు చేసిందని ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై గత రెండు రోజులుగా సీఐడీ బృందాలు కేజీహెచ్‌లో విచారణ సాగిస్తున్నాయి. కేజీహెచ్‌ దస్త్రాల్లో నిక్షిప్తమైన సమాచారంతో ప్రస్తుత పరికరాల వివరాలను సరిపోల్చడం, వాటి వార్షిక నిర్వహణ వివరాలపై ఆరా తీస్తున్నారు. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 8మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది విచారణలో పాలుపంచుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని విచారణ అధికారులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని