సింహాద్రినాథుడికి స్వర్ణ పుష్పార్చన
logo
Published : 18/06/2021 03:51 IST

సింహాద్రినాథుడికి స్వర్ణ పుష్పార్చన

ప్రత్యేక పూజలందుకున్న స్వామి వారు

సింహాచలం (అడివివరం), న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి సన్నిధిలో ఆర్జిత సేవల్లో భాగంగా గురువారం స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై అధిష్ఠింపజేశారు. బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శత నామార్చన నిర్వహించారు. అదే వేదికపై నిత్య కల్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించారు. రుసుము చెల్లించిన భక్తులకు యూట్యూబ్‌ ద్వారా పూజలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని