మానవ అక్రమ రవాణా హేయమైన చర్య
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

మానవ అక్రమ రవాణా హేయమైన చర్య

విద్యార్థినులతో కలిసి జ్యోతి వెలిగిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. హరిహరనాథశర్మ

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: మానవ అక్రమ రవాణాను నివారించడం అందరి బాధ్యతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.హరిహరనాథశర్మ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ. ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌లో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మానవ అక్రమరవాణా అత్యంత హేయమైన చర్య అని, ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ. కార్యదర్శి, న్యాయమూర్తి కె.కె.వి.బులికృష్ణ, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.ఎం.రెడ్డి, లోక్‌అదాలత్‌ జాతీయ శిక్షకులు ఆర్‌.శ్రీనివాసరావు, కె.మురళీధర్‌ ప్రసంగించారు. ధఫరణి ఆర్గనైజేషన్‌కు చెందిన శ్రీహరినారాయణ రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్‌.వి.పి.న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని