గెలుపు ఆశలు.. పదవుల లెక్కలు!
eenadu telugu news
Published : 18/09/2021 05:37 IST

గెలుపు ఆశలు.. పదవుల లెక్కలు!

పరిషత్తు పీఠాలపై నేతల సమాలోచనలు

ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

ఈఏడాది జరిగిన పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు, మద్దతుదారులే ఎక్కువ మంది విజయం సాధించారు. తాజాగా ప్రాదేశిక పోరులోనూ తామే గెలుస్తామని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు.

ట్ల లెక్కింపు ఇప్పుడు చేపడుతున్నా ఈ ఎన్నికలు పంచాయతీ, పురపాలిక ఎన్నికలతో పాటే జరిగాయి. దీంతో గ్రామాలు, పట్టణాల్లో వచ్చిన ఫలితాలే ప్రాదేశికంలోనూ పునరావృతం అవుతాయని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆదివారం జరగనున్న ప్రాదేశిక ఓట్ల లెక్కింపునకు తమ పార్టీ అభ్యర్థులను సమాయత్తం చేస్తున్నారు. ముందు గెలుపు..తరువాత పరిషత్తు పీఠాలపై ఆలోచిద్దామని అభ్యర్థులకు సూచిస్తారు. లెక్కింపు కేంద్రాల్లో ఎవరిని ఏజెంట్లుగా నియమించుకోవాలి.. అభ్యర్థులు ఎలా వ్యవహరించాలి.. ఫలితాలు వెలువడిన తరువాత ఎక్కడ సమావేశం కావాలనే విషయాలపై కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు.


జిల్లాలో 612 ఎంపీటీసీ, 37 జడ్పీటీసీ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీలకు కలిపి 1,929 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఎక్కువ స్థానాల్లో ద్విముఖ పోటీయే నెలకొంది. కొన్నిచోట్ల తెదేపా, వైకాపా మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ జరిగింది.


ఎన్నికల బహిష్కరించాలన్న పార్టీ పిలుపు మేరకు ఎక్కువ సెగ్మెంట్లలో తెదేపా అభ్యర్థులు పోటీలో నిలుచున్నా గెలుపు కోసం ప్రయత్నించలేదు. ఆయా స్థానాలన్నీ వైకాపా వశం అవుతాయని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ధీమాతో ఉన్నారు. నర్సీపట్నం, మాడుగుల, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం కొన్ని స్థానాల్లో వైకాపాకు గట్టి పోటీనే ఇచ్చారు. ఆ స్థానాలపైనే అభ్యర్థులతో పాటు పార్టీ నేతలు దృష్టి సారిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న స్థానాల్లో లెక్కింపు కేంద్రాల వద్ద ఎలా వ్యవహరించాలనే విషయమై పార్టీ నేతలు అభ్యర్థులకు ఇప్పటికే మార్గదర్శనం చేశారు. బ్యాలెట్‌ పేపర్‌ లెక్కింపు సమయంలో జాగ్రత్తగా ఉండాలని గుర్తులపై ముద్రలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంపైనా అప్రమత్తంగా ఉండాలని వివరించారు.


శుక్రవారం పాడేరు కేంద్రంగా మన్యం ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడారు. గెలుస్తామనే ధీమా ఉన్నా ప్రతి ఓటును నిశితంగా పరిశీలించాలని అభ్యర్థులకు సూచించారు.


ర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా తమ పార్టీ అభ్యర్థులను లెక్కింపు కేంద్రాలకు వెళ్లాలని, ఏజెంట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎలమంచిలి, చోడవరం నియోజకవర్గాలకు సంబంధించి అధికారపార్టీ అభ్యర్థులతో శనివారం సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.


గెలిచి రండి.. చూద్దాం

వాస్తవానికి ఈ ప్రాదేశిక ఎన్నికలు గతేడాది ఏప్రిల్‌లో జరగాలి. కరోనా కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. అప్పటికే నామినేషన్ల పర్వం ముగియడం, బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ జరిగిపోయింది. అంతకు ముందే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల్లో మండల పరిషత్తు (ఎంపీపీ) పీఠాలు ఎవరెవరికి కేటాయించాలి.. ఉప పీఠాలు ఎవరికి ఇవ్వాలనే విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు చాలావరకు నిర్ణయాలు తీసుకున్నారు. మరికొన్ని మండలాల పీఠాలపై పోటీ ఎక్కువగా ఉన్నచోట గెలిచిన తరవాత నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. అయితే అప్పుడు వాయిదా పడిన ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగడం, వాటి లెక్కింపు అయిదు నెలలు తరువాత జరుగుతుండడంతో ఆశావహులంతా మళ్లీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు.

* లెక్కింపుపై హైకోర్టు అనుమతించిన వెంటనే ఎంపీపీ స్థానాలు ఆశించేవారంతా తమ అనుకూల అభ్యర్థులతో మంతనాలు సాగిస్తున్నారు.

అభ్యర్థులను తీసుకుని ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి గతంలో తమకు ఇచ్చిన మాటను గుర్తుచేస్తున్నారు.

మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్తు ఛైర్మన్ల ఎన్నికకు ఇంకా కొద్దిరోజులు సమయం ఉన్నందున ముందు లెక్కింపు పూర్తిచేసుకుని గెలిచి రండి, తరవాత వాటి గురించి మాట్లాడదామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఎంపీపీ పీఠాల కోసం వసూళ్లకు ప్రణాళిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని