అభివృద్ధికిమీ సహకారం అవసరం
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

అభివృద్ధికిమీ సహకారం అవసరం


మాట్లాడుతున్న జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాను అభివృద్ధిపథంలో నడిపించడానికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని అధికారులను జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కోరారు. బుధవారం జడ్పీ సమావేశమందిరంలో నిర్వహించిన ఆర్థిక ప్రణాళిక, గ్రామీణ అభివృద్ధి స్థాయీ సంఘాల (స్టాండింగ్‌ కమిటీలు) సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ముఖ్యమంత్రికి పేరు తెచ్చేలా అర్హులకు పథకాలు అందేలా చూడాలన్నారు. ముందుగా సంబంధిత శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అనంతరం సమీక్షించారు.

ప్రస్తావించారిలా..!

ఐటీడీఏ పరిధిలో మొక్కలకు ట్రీగార్డులు లేవని మక్కువ జడ్పీటీసీీ సభ్యుడు ఎం.శ్రీనివాసరావు తెలిపారు. వియ్యంపేట పీీహెచ్‌సీీలో కు.ని. శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు తీసుకోవాలని కొత్తవలస జడ్పీటీసీ సభ్యురాలు ఎన్‌.శ్రీదేవి డిమాండు చేశారు.ఎమ్మెల్యే రాజన్న దొర, జడ్పీటీసీ సభ్యులు ఎం.బాబ్జీ, వలిరెడ్డి శిరీష, వర్రి నర్సింహమూర్తి, పడాల మంజులత, లెంక సన్యాసప్పడు, కె.సింహాచలం పాల్గొన్నారు. l జడ్పీ సర్వసభ్య సమావేశం నవంబరు పదిలోపు నిర్వహించనున్నట్లు ఛైర్మన్‌ శ్రీనివాసరావు సూచనప్రాయంగా తెలియజేశారు. l జడ్పీ కార్యాలయంలో గురువారం జరగాల్సిన 4, 7 స్థాయీ సంఘ సమావేశాలు మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లు సీీఈవో టి.వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగు గంటలకు సమావేశ మందిరంలో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు ఇవీ..

l సాంకేతిక సమస్యల వల్ల రైతు భరోసాకు అనర్హులైన వారి వివరాలను మండలాల వారీగా తెలియజేయాలి. సర్వసభ్య సమావేశం నాటికి నివేదికను పంపించాలి. ఆర్‌బీకే యూనిట్‌గా రెవెన్యూ రికార్డులతో సంబంధం లేకుండా సాగుభూమిని ఈ క్రాప్‌ చేయాలి. l ఉపాధిహామీలో అపరిష్కృతంగా నిలిచిన పనుల వివరాలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు పంపించాలి. అయిదుశాతం లోపు జరిగిన పనులను ఆన్‌లైన్‌లో చూపించేలా సీఆర్డీతో మాట్లాడాలి. కుటుంబ హామీ పత్రాలు (జాబ్‌కార్డులు) పెరుగుతున్నందున మేజర్‌ పంచాయతీల్లో ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించే అంశాన్ని పరిశీలించాలి. l పీీహెచ్‌సీీల్లో వ్యాక్సిన్‌, మందులు అందుబాటులో ఉండేలా ప్రతి 15 రోజులకు సమావేశాలు నిర్వహించాలి. పీీహెచ్‌సీీల మ్యాపింగ్‌లో లోటుపాట్లను ప్రభుత్వానికి నివేదించి తగు చర్యలు తీసుకోవాలి. l స్వచ్ఛ సంకల్పం వాహనాలను ప్రారంభించి, సిబ్బంది జీతాలు నిర్ణయించాలి. ప్రభుత్వ లక్ష్యాలు చేరుకునేందుకు నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించాలి. జిల్లా స్థాయిలో ఎంపీీపీీ, జడ్పీటీసీీ, సర్పంచులతో సమావేశం నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించాలి.


హాజరైన ప్రభుత్వశాఖల అధికారులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని