Published : 03/03/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తొలిరోజు 162 ఉపసంహరణలు


ఏలూరులో నామపత్రాల కేంద్రం వద్ద హడావుడి

ఏలూరు నగరం, జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: పుర ఎన్నికల ఘట్టం కీలకు దశకు చేరింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజు జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఏలూరు కార్పొరేషన్, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నరసాపురం పురపాలక సంఘాల్లో 162 మంది అభ్యర్థులు తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. బుధవారం సాయంత్రం వరకు దీనికి గడువు ఉంది. మంగళవారం సాయంత్రానికి 682 నామపత్రాలు మిగిలాయి. 
పది ప్రాంతాల్లో ఏకగ్రీవం!
జిల్లాలో పది ప్రాంతాల్లో ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కొవ్వూరు పురపాలక సంఘంలో ఆరు ఉన్నాయి. 5, 11, 12, 15, 22 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు సాయిగీత, లక్ష్మీప్రసన్న, వెంకట పద్మావతి, శ్రీనివాస రవీంద్ర, రమేష్‌బాబు; 16వ వార్డులో తెదేపా అభ్యర్థి కండెల్లి రామారావు మిగిలారు. ఏలూరు కార్పొరేషన్‌లో 1, 3, 32 డివిజన్లలో వైకాపా అభ్యర్థులు ఆరేపల్లి రాధ, బొద్దాని అఖిల, బండారు సునీతారత్నం ఏకగ్రీవమైనట్లే. నరసాపురం 5వ వార్డులో వన్నెంరెడ్డి వెంకట దుర్గారావు ఒక్కరే మిగిలారు. వీటిపై బుధవారం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 
ఏలూరులో 65 మంది: ఏలూరు కార్పొరేషన్‌లో 65 మంది నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. వైకాపా తరఫున 36, తెదేపా 17, జనసేన 5, సీపీఐ 1, స్వతంత్రులు ఆరుగురు పోటీ నుంచి నిష్క్రమించారు. 

జంగారెడ్డిగూడెంలో.. డమ్మీలుగా వేసిన ఏడుగురు తెదేపా అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు.

కొవ్వూరు: 60 మంది పోటీ నుంచి వైదొలిగారు. వీరిలో తెదేపా నుంచి 33, వైకాపా 22, స్వతంత్రులు 4, సీపీఐ నుంచి ఒకరు చొప్పున నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. 

నిడదవోలు: ఇక్కడ 15 మంది ఉపసంహరించుకోగా.. వీరిలో వైకాపా 12, తెదేపా 1, భాజపా 1, స్వతంత్రులు 1 చొప్పున తప్పుకొన్నారు.

నరసాపురం: 15 మంది వైదొలిగారు. వీరిలో వైకాపా 7, తెదేపా 3, జనసేన, కాంగ్రెస్‌ల నుంచి 2; భాజపా నుంచి ఒకరు ఉన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని