తెలంగాణ పథకాలు రాష్ట్రాలకు ఆదర్శం
eenadu telugu news
Published : 28/10/2021 00:37 IST

తెలంగాణ పథకాలు రాష్ట్రాలకు ఆదర్శం

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మంత్రి సబిత

కొడంగల్‌:  రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి సబితారెడ్డి అన్నారు. వరంగల్‌లో నిర్వహించనున్న విజయగర్జన సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో  ప్రతి ఏడాది రైతులకు రూ.48వేల కోట్ల రైతుబంధు కింద వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని.. ఒక్క కొడంగల్‌ నియోజకవర్గంలో రూ.210 కోట్లు వస్తుందని అన్నారు. రైతు బీమా, కల్యాణలక్ష్మి, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయతో పాటు ఎన్నో పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం,  కస్తూర్బా పాఠశాల భవనాలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ. సోమవారం నుంచి గురువారం వరకు కొడంగల్‌ క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని