కుటుంబ సభ్యుల సహకారంతోనే పోలీసులు ఉద్యోగంలో రాణిస్తారు  - Hyderabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

కుటుంబ సభ్యుల సహకారంతోనే పోలీసులు ఉద్యోగంలో రాణిస్తారు 

నగర కమిషనర్‌ అంజనీకుమార్‌

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌ పనితీరుతోనే మనకు మంచిపేరు వచ్చిందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే పోలీసులు ఉద్యోగంలో రాణించగలుగుతున్నారని స్పష్టం చేశారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంజనీకుమార్‌ హాజరయ్యారు. పోలీసుల పిల్లలకు పోలీస్‌ స్టేషన్‌లోని అన్ని విభాగాలను చూపిస్తూ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు వచ్చిందన్నారు. ఇక్కడి పోలీసింగ్‌ విధానాన్ని విదేశీయులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. మనపై నమ్మకంతోనే నగరంలో రోజుకు దాదాపు 300 నుంచి 400 మంది బాధితులు పోలీసులకు ఫోన్‌ చేసి సహాయం పొందుతున్నారని పేర్కొన్నారు. పోలీసులతోపాటు వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వంద శాతం నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల పని విధానంపై వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే ఉద్యోగంలో రాణించడం కష్టమవుతుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ గోవర్ధన్‌రెడ్డి, ఏసీపీ సుధాకర్‌, ఓయూ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.